Pawan Kalyan: మంగళగిరిలో పవన్ కల్యాణ్‌ను కలిసిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad meets Pawan Kalyan in Mangalagiri
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా పవన్‌తో భేటీ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో పవన్‌ను కలిశారు. పలు విషయాలు చర్చించుకున్నారు. 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌కి పవన్ అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్‌ను దుశ్సాలువాతో రాజేంద్ర ప్రసాద్ సన్మానించారు. రాజేంద్రప్రసాద్‌ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   
Go Back to Shorts
Pawan Kalyan
Rajendra Prasad
Andhra Pradesh
Mangalagiri
Padma Shri
Deputy Chief Minister
Meeting
Political News
Telugu Cinema
Social Media

More Telugu News