Bangladesh Hindu Woman: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ మహిళపై అత్యాచారం, జుట్టు కత్తిరింపు

Bangladesh Hindu Woman Raped Hair Shaved in Kaliganj
  • కలిగంజ్‌లో హిందూ వితంతు మహిళపై ఇద్దరు అత్యాచారం
  • డబ్బులు అడిగితే నిరాకరించడంతో జుట్టు కత్తిరింపు
  • ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఓ వితంతు హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె జుట్టు కత్తిరించిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

కలిగంజ్‌లో బాధిత మహిళ రెండున్నరేళ్ల క్రితం షహీన్, అతని తమ్ముడి వద్ద కొంత భూమిని, ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి షహీన్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం షహీన్, అతని స్నేహితుడు హసన్ ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం వారు ఆమెను డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. నిందితులు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. బాధితురాలు స్పృహ కోల్పోవడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం ఆమె ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. ఆసుపత్రిలో బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించామని, నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Bangladesh Hindu Woman
Bangladesh
Hindu minority
Rape
Assault
Hair cutting
Shahin
Hasan

More Telugu News