Advertisement

వెనెజువెలా అధ్యక్షుడికి పుట్టపర్తితో బలమైన బంధం.. సత్యసాయికి పరమభక్తుడు మదురో

International
Advertisement
  • వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సత్యసాయి బాబా భక్తులు
  • 2005లో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మదురో దంపతులు
  • తన కార్యాలయంలో సాయిబాబా చిత్రపటాన్ని ఉంచుకునేవారు మదురో
  • సాయిబాబా మరణించినప్పుడు వెనెజువెలాలో జాతీయ సంతాప దినం ప్రకటించిన వైనం
ఇటీవలే అమెరికా దళాలకు పట్టుబడిన వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ఏపీతో ఒక బలమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నియంతగా ముద్రపడిన మదురో, పుట్టపర్తి సత్యసాయి బాబాకు వీరాభిమాని కావడం చాలామందికి తెలియని విషయం.

క్యాథలిక్‌గా పెరిగినప్పటికీ, మదురోకు తన భార్య సిలియా ఫ్లోర్స్ ద్వారా భారతీయ ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా పరిచయమయ్యారు. వారిద్దరూ సాయిబాబా అనుచరులుగా మారి, 2005లో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, సత్యసాయి బాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో బాబాతో పాటు వారు నేలపై కూర్చున్న ఫొటో కూడా ఉంది.

మదురో అధికారంలోకి వచ్చాక కూడా ఈ ప్రభావం కొనసాగింది. ఆయన తన కార్యాలయంలో సాయిబాబా చిత్రపటాన్ని ప్రముఖంగా ఉంచుకునేవారని కథనాలున్నాయి. 2011లో సాయిబాబా మరణించినప్పుడు, అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో చొరవతో వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సంతాప తీర్మానం చేసింది. దేశంలో ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించి, బాబా ఆధ్యాత్మిక సేవలను గుర్తించింది.

మదురో పాలనలో చాలా విదేశీ సంస్థలు వెనిజులాను విడిచి వెళ్లినా, సత్యసాయి సంస్థ కార్యకలాపాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాయి. 2025 నవంబర్‌లో పట్టుబడటానికి కేవలం కొన్ని నెలల ముందు కూడా సాయిబాబా శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. బాబాను 'జ్యోతిర్మయ స్వరూపుడు' అని అభివర్ణించారు. "మేము కలిసినప్పుడు నేను ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను... ఆ గొప్ప గురువు జ్ఞానం మనల్ని నిరంతరం ప్రకాశవంతం చేయాలి" అని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పుట్టపర్తితో, సాయిబాబాతో మదురోకున్న ఆధ్యాత్మిక బంధం చివరి వరకూ కొనసాగడం గమనార్హం.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Nicolas MaduroVenezuelaSathya Sai BabaPuttaparthiPrasanthi NilayamSai Baba devoteeVenezuela politicsIndian spiritual guruCilia FloresSpiritual connection

More Telugu News

ఏపీకి దిగ్గజ సంస్థల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు

12 Nov, 23:24

మంగళగిరిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించిన మిరానా రియల్టీ.. 9.5 ఎకరాల్లో 59 ప్రీమియం విల్లాలు

12 Nov, 23:16

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని సౌదీ అరేబియాలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

12 Nov, 23:05

ముంబైలో అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు

12 Nov, 22:55

లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలి: ఎన్విడియా సీఈవో మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు

12 Nov, 22:48

విశాఖలో సీఐఐ సదస్సు.. మంత్రి లోకేశ్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

12 Nov, 22:20

మహిళా కమిషన్ ఎదుట హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి

12 Nov, 22:07

జనసైనికులకు వైసీపీ లీగల్ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

12 Nov, 21:53

శత్రుచర్ల విజయరామరాజు మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

12 Nov, 21:36

రన్‌వేపైకి దూసుకొచ్చిన వీధి కుక్క.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో తప్పిన పెనుప్రమాదం

12 Nov, 21:26

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15
..More Telugu News