Swaroop: కర్ణాటకలో కంబళ పోటీల్లో సరికొత్త రికార్డు.. 10.87 సెకన్లలో 125 మీటర్లు పూర్తి చేసిన స్వరూప్

Swaroop sets new record in Kambala race in Karnataka
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో సంప్రదాయ కంబళ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా మస్తికట్టె స్వరూప్ అనే యువకుడు దున్నపోతుల పందేల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళూరులో జరిగిన ఈ పోటీల్లో స్వరూప్ 125 మీటర్ల దూరాన్ని కేవలం 10.87 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

గతంలో శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని 8.78 సెకన్లలో పూర్తి చేయగా, ఆ రికార్డును స్వరూప్ అధిగమించాడు. స్వరూప్ 125 మీటర్లను 10.87 సెకన్లలో పూర్తి చేయడంతో, 100 మీటర్ల దూరాన్ని 8.69 సెకన్లలోనే అధిగమించినట్లయింది.

కర్ణాటక తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ గ్రామీణ క్రీడను నిర్వహిస్తారు. గత మూడేళ్లుగా కంబళ రేసులో పాల్గొంటున్నానని, గతంలో జూనియర్ విభాగంలో పాల్గొనేవాడినని స్వరూప్ తెలిపాడు. ఈ ఏడాది తొలిసారి సీనియర్ విభాగంలో పాల్గొని రికార్డు సృష్టించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇది ఊహించని విజయమని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Swaroop
Kambala
Kambala race
Karnataka
Buffalo race
Srinivasa Gowda
Mangalore
Rural sports

More Telugu News