ఆమనగల్ లో పిచ్చి కుక్క దాడి.. కొట్టి చంపిన స్థానికులు.. వీడియో ఇదిగో!

ఆమనగల్ లో పిచ్చి కుక్క దాడి.. కొట్టి చంపిన స్థానికులు.. వీడియో ఇదిగో!

––
రంగారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్క ఒకేరోజు 36 మందిపై దాడి చేసింది. జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పిచ్చి కుక్క స్వైర విహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్డుపై కనిపించిన వారినల్లా కరచుకుంటూ వెళ్లిందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపారు. కుక్క దాడిలో గాయపడిన 36 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి పంపించినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement

More Telugu News