ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారం... సిట్ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
- బుధవారం సాయంత్రం సిట్ ఎదుట హాజరైన ప్రకాశ్ రాజ్
- సీఐడీ కార్యాలయంలో నటుడిని ప్రశ్నిస్తున్న అధికారులు
- నిన్న విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు
బెట్టింగ్ యాప్‌లకు కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు. ఈ యాప్‌లకు బానిసలైన కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు.