Rahul Gandhi: త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తాం... మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi says Hydrogen bomb blast soon Modi to face tough times
షార్ట్స్‌లో చూడండి
ఓట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.

'ఓటర్ అధికార్ యాత్ర' ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తామంటే బీజేపీని అనుమతించేది లేదని అన్నారు. అందుకే ఈ యాత్రను నిర్వహించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటకలలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామని వెల్లడించారు. ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో త్వరలో హైడ్రోజన్ బాంబును పేల్చుతామని ఆయన అన్నారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
Narendra Modi
Hydrogen bomb
Patna
Voter Adhikar Yatra
Election fraud

More Telugu News