Advertisement

అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’.. రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్

Mahavatar Narasimha Movie Box Office Collections Exceed Expectations
  • బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ చిత్రం
  • స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు లేకుండానే వ‌సూళ్ల‌ వర్షం కురిపిస్తున్న మూవీ
  • భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ 
  • హోంబలే ఫిల్మ్స్  నిర్మాణం.. అశ్విన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం    
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ప్రేక్ష‌కుల‌ను అల‌రించి, భారీ హిట్స్ గా నిలిచిన‌ సినిమాలు చాలానే ఉన్నాయి. అలా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఇలా ఏవీ లేకుండానే వచ్చిన ఆ సినిమా వ‌సూళ్ల‌ వర్షం కురిపిస్తోంది. ఆ సినిమానే  ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థం హోంబలే ఫిల్మ్స్ వెల్ల‌డించింది. "అన్ని రికార్డులను అధిగమించి, కేవలం 8 రోజుల్లో రూ. 60.5 కోట్లకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది" అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల ఆధారంగా ప‌దేళ్ల‌పాటు వ‌రుస‌గా సినిమాలు రూపొంద‌నున్నాయి. ‘మ‌హావ‌తార్’ సినిమాటిక్ యూనివ‌ర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 

Advertisement
Mahavatar Narasimha
Mahavatar Narasimha movie
Animated movie
Ashwin Kumar
Indian animated film
Homebale Films
Box office collection
Movie records
Vishnu avatar
Dasavataram

More Telugu News