భారత కంపెనీలపై ఆంక్షలు.. మరో షాకిచ్చిన ట్రంప్
- ఇరాన్ నుంచి పెట్రోలియం కొనుగోలు చేయడంపై ఆగ్రహం
- ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలపై ఆంక్షలు
- జాబితాలో మన దేశానికి చెందిన 6 కంపెనీలు
‘మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ఆజ్యం పోస్తున్న ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. చమురు విక్రయాలతో ఇరాన్ కు సమకూరుతున్న నిధులను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టిన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారు’ అని అమెరికా స్పష్టం చేసింది.
ఆంక్షలు ఎదుర్కోనున్న భారత కంపెనీలు..
- కాంచన్ పాలిమర్స్
- ఆల్‌కెమికల్ సొల్యూషన్స్
- రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ
- జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్
- గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్
- పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్