20ల్లో ఈ 10 అలవాట్లు ఉంటే.. డబ్బు కోసం ఎప్పుడూ ఆందోళన ఉండదు!
- జీతం రాగానే ముందుగా పొదుపు
- ప్రతి ఖర్చుపై నిఘా అవసరం
- ఆదాయం పెరిగినా ఖర్చులు అదుపులోనే
- అత్యవసర నిధి తప్పనిసరి
- చిన్న మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభం
- అవసరం, కోరిక మధ్య తేడా గుర్తించాలి
20 ఏళ్లు దాటాక మొదటి జీతం, మొదటి క్రెడిట్ కార్డు, మొదటి పెట్టుబడి.. ఇలా జీవితంలో ఎన్నో కొత్త ఆరంభాలు మొదలవుతాయి. ఇదే సమయంలో చేసే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలే భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. భారీ జీతం సంపాదించడమే సంపదకు మార్గం కాదు. సరైన ఆర్థిక అలవాట్లు పెంచుకోవడమే నిజమైన పెట్టుబడి. 20ల్లో యువత తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన 10 ముఖ్యమైన ఆర్థిక అలవాట్లు ఇవే.
1. ముందు పొదుపు
జీతం రాగానే కనీసం 10-20 శాతం మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడికి కేటాయించండి. మిగిలిన డబ్బుతోనే ఖర్చులు ప్లాన్ చేసుకోండి.
2. డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది?
నెలరోజుల పాటు ప్రతి ఖర్చును నమోదు చేయండి. అవసరం లేని ఖర్చులు సులభంగా గుర్తించవచ్చు.
3. ఖర్చులు పెంచొద్దు
జీతం పెరిగినప్పుడల్లా జీవనశైలిని ఖరీదుగా మార్చుకోవద్దు. పొదుపు శాతాన్ని కూడా పెంచండి.
4. అత్యవసర నిధి
వైద్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి అనుకోని పరిస్థితుల కోసం కనీసం కొన్ని నెలల ఖర్చులకు సరిపడా నిధిని సిద్ధంగా ఉంచుకోండి.
5. పెట్టుబడి మొదలు పెట్టండి
పెట్టుబడికి పెద్ద మొత్తం అవసరం లేదు. చిన్న మొత్తంతో ప్రారంభించినా దీర్ఘకాలంలో మంచి ఫలితం లభిస్తుంది.
6. అవసరం.. కోరిక మధ్య తేడా
ఏదైనా కొనేముందు అది నిజంగా అవసరమా, లేక కేవలం కోరికేనా అని ఒక్కసారి ఆలోచించండి.
7. ఒకే ఆదాయంపై ఆధారపడొద్దు
ఉద్యోగంతో పాటు ఫ్రీలాన్స్, బోధన, కంటెంట్ క్రియేషన్ వంటి అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి.
8. అప్పు తీసుకునే ముందు
వడ్డీ, చెల్లింపు గడువు, నిబంధనలపై స్పష్టత లేకుండా రుణాలు తీసుకోవద్దు.
9. మాట్లాడేందుకు సంకోచించొద్దు
జీతాలు, పెట్టుబడులు, పన్నులు, ఆర్థిక ప్రణాళికపై ఇతరుల అనుభవాలు తెలుసుకోవడం ఉపయోగపడుతుంది.
10. నిరంతర క్రమశిక్షణ
ఒక్కోసారి తప్పులు జరిగినా మంచి ఆర్థిక అలవాట్లను వదలొద్దు. చిన్న చిన్న మంచి నిర్ణయాలే దీర్ఘకాలంలో పెద్ద సంపదను సృష్టిస్తాయి.