ఆసియా కప్ వేదిక ఖరారు... టోర్నీ ఎప్పుడు, ఎక్కడంటే...!

Asia Cup 2025 Venue Finalized Tournament Schedule and Location
షార్ట్స్‌లో చూడండి
ఆసియా కప్ 2025 తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వే అయినప్పటికీ... తటస్థ వేదికలో (యూఏఈ) ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించింది. 

ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. కాగా, ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంటే... లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 రౌండ్‌లో మరోసారి తలపడతాయి. కుదిరితే ఈ రెండు జట్లే ఫైనల్లోనూ ఆడే అవకాశం ఉంది.
Go Back to Shorts
Asia Cup
Asia Cup 2025
UAE
United Arab Emirates
Dubai
Abu Dhabi
BCCI
India vs Pakistan
Cricket Tournament

More Telugu News