అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- తాజ్ కృష్ణ హోటల్‌లో అమెరికా స్వాతంత్ర్య వేడుకలు
- కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్‌తో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి
- భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు 1947లో ప్రారంభమై నేటి వరకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాల్లో మరింత దృఢంగా మారాయని అన్నారు. ఈ వేడుకలో భారత్-అమెరికా స్నేహ సంబంధాలను గుర్తు చేస్తూ, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.