Radhika Yadav: ఇన్‌స్టా రీల్స్ మోజు.. టెన్నిస్ క్రీడాకారిణి రాధికను కాల్చి చంపిన కన్నతండ్రి

Radhika Yadav Shot Dead by Father Over Instagram Reels in Gurugram
షార్ట్స్‌లో చూడండి
సామాజిక మాధ్యమాల వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంపై తలెత్తిన వివాదం చివరకు ఒక తండ్రి తన కన్న కూతురినే తుపాకీతో కాల్చి చంపేంత దారుణానికి దారితీసింది. ఈ అత్యంత విషాదకర ఘటన గురుగ్రామ్‌లో గురువారం చోటుచేసుకుంది.

గురుగ్రామ్‌లోని సెక్టార్-57, సుశాంత్ లోక్ ఫేజ్-2లో నివసిస్తున్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను ఆమె తండ్రే కాల్చి చంపాడు. రాధిక రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో విజయం సాధించింది. అయితే, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వ్యసనం ఉందని, ఈ విషయంలో తండ్రితో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి తన వద్ద ఉన్న తుపాకీతో రాధికపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తండ్రిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Radhika Yadav
Gurugram
Instagram Reels
Tennis player
Social media addiction
Crime news

More Telugu News