పవన్ పై కించపరిచే పోస్టులు... ముగ్గురు అరెస్ట్
- పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
- నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
ఈ ఘటనపై జనసేన నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టయిన వారిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్నం మండలం వలందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.