కాంతార చాప్టర్-1 షూటింగ్ లో బోటు ప్రమాదం!
- కాంతార చాప్టర్ 1 ప్రాజెక్టుకు వరుస ప్రమాదాలు
- గత ఏడాది జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం
- నదిలో కొట్టుకుపోయి కపిల్ అనే నటుడు మృతి
- కొన్నిరోజుల వ్యవధిలో ఇద్దరు నటులు గుండెపోటుతో కన్నుమూత
- తాజాగా బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ రిషబ్ శెట్టి, చిత్రబృందం
అదే నెలలో రాకేశ్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో చనిపోగా, మొన్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాద ఘటనలు మరువకముందే మరో ప్రమాదం జరిగింది. తాజాగా జరిగిన బోటు ప్రమాదంలో నటుడు రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతుండగా, షూటింగ్‌లో పాల్గొన్న నటుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది ఆర్టిస్టులు కలిసి ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కెమెరాతో పాటు సాంకేతిక పరికరాలు కొట్టుకుపోగా, రిషబ్‌తో పాటు పలువురు నటులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.