పరవాడ ఫార్మాసిటీలో విషాదం: విషవాయువులను పీల్చి ఇద్దరు కార్మికుల మృతి
- పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం
- విషవాయువులను పీల్చడంతో ముగ్గురు కార్మికులకు అస్వస్థత
- షీలానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక కార్మికుడు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కార్మికులు చంద్రశేఖర్, కుమార్ మృతి చెందగా, మరో కార్మికుడు షీలానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.