పీఎస్ లో యువకుడి మృతి: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో యువకుడి మృతి
- స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
- తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ
- పోలీసుల వేధింపులే మృతికి కారణమని మీడియా కథనాల ప్రస్తావన
- రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
పోలీసుల వేధింపుల కారణంగానే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది.
ఈ నోటీసులకు రెండు వారాల్లోగా స్పందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. యువకుడి మృతికి దారితీసిన పరిస్థితులు, పోలీసులపై వచ్చిన ఆరోపణలపైన లోతైన విచారణ జరిపి, వాస్తవాలను నివేదించాలని కోరింది.