ఈ సమస్యపై భారత్, శ్రీలంక ప్రభుత్వాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: పవన్ కల్యాణ్
- తమిళనాడు మత్స్యకారుల ఘటనలపై పవన్ ఆందోళన
- సమస్య పరిష్కారానికి భారత్, శ్రీలంక ప్రభుత్వాలు చర్చలు జరపాలని సూచన
- మోదీ, చంద్రబాబుతో కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తామని వెల్లడి
ఏపీకి అమరావతే ఏకైక, శాశ్వత రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక, శాశ్వత రాజధానిగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఇది కేవలం కాంక్రీట్ నిర్మాణాల సముదాయం కాదని, ప్రజాస్వామ్యానికి, జవాబుదారీతనానికి, న్యాయానికి ప్రతీకగా ఉంటుందని ఆయన అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను కొనియాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా అమరావతే ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 29 వేలకు పైగా రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూములను త్యాగం చేస్తే, గత ప్రభుత్వం వారి త్యాగాలను అవమానించిందని మండిపడ్డారు. రైతులు రోడ్లపైకి వచ్చి ముళ్ల కంచెల మధ్య ఆందోళనలు చేయాల్సి వచ్చిందని, లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఎంతోమంది రైతులు ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఆనాడు రైతులు పడ్డ కష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళతామని, అమరావతే రాజధానిగా ఉంటుందని తాను హామీ ఇచ్చానని, నేడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.