Pavani Reddy: మళ్లీ పెళ్లి చేసుకున్న పావని రెడ్డి!

Pavani Reddys Second Wedding Bigg Boss Couple Ties the Knot

   


త‌మిళ బిగ్ బాస్ షోలో పోటీదారులుగా పాల్గొన్న అమీర్, పావని రెడ్డి ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. వీరిద్దరి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు వారి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అమీర్ ముస్లీం అయినప్పటికీ అమ్మాయి ఇష్ట ప్రకారం హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, పావనికి 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక‌, పావని రెడ్డి 2012 నుంచి సినిమాల్లో న‌టిస్తున్నారు. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, త‌మిళ సీరియ‌ళ్ల ద్వారా కూడా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆమె అల‌రించారు. 

సీరియల్స్‌లో పావని నటన చూసి ఇంప్రెస్ అయిన అమీర్, క్రమంగా ఆమె అభిమానిగా మారిపోయాడు. ఇది కాకుండా విజయ్ టీవీలో డాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న అమీర్‌కు బిగ్ బాస్ సీజన్ 5 షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని లోపలికి వెళ్లిన అమీర్, అక్కడ పావనికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. దాదాపు మూడేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు.


Pavani Reddy
Amir
Tamil Bigg Boss
Marriage
Actress Pavani Reddy
Pavani Reddy wedding
Celebrity wedding
Hindu wedding
Second marriage
Telugu actress
  • Loading...

More Telugu News