16,347 టీచర్ పోస్టులతో నేడు ఏపీ మెగా డీఎస్సీ
- నేటి ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్
- జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టుల భర్తీ
- నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు
నేటి నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. అనంతరం వారం రోజులకు మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

