పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై తీర్పు రిజర్వ్
––
మరోవైపు, ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కు గడువు విధించిన సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని అభిషేక్ మను సింఘ్వీ మరోసారి కోర్టుకు తెలిపారు. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైనదేనని సమర్థించారు. ఈ విషయంపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏమిటి?’ అని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.