హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి
- పోలీస్ స్టేషన్‌లలో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హర్షసాయి పిటిషన్
- తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్
- ఆధారాలు లేకుండానే కేసులు పెడుతున్నారని ఆరోపణ
హర్షసాయి దాఖలు చేసిన పిటిషన్ రేపు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అతడిపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో వేర్వేరుగా బెట్టింగ్ యాప్ కేసులు నమోదయ్యాయి. హర్షసాయి సహా పలువురు యూట్యూబర్లపై ఈ కేసులు నమోదైన విషయం తెలిసిందే.