హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- హయత్‌నగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు
- రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- దాదాపు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
మంటల్లో కాలిపోయిన కారు
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంశివారులో ఒక ఖరీదైన కారు అగ్నికి ఆహూతైంది. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపడంతో అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.