నేను కూడా ఘిబ్లిఫైడ్ గ్యాంగులో చేరాను!: ఆసక్తికర ఫొటోలు పంచుకున్న మంత్రి నారా లోకేశ్
ఇప్పుడు ఎవరైనా ఈ టూల్ సాయంతో తమ ఫొటోలను ఘిబ్లీ స్టయిల్లోకి మార్చుకోవచ్చు. ఓ కార్టూన్ లేదా యానిమే తరహాలో వారి ఫొటోలు దర్శనమిస్తాయి. టెక్ ప్రపంచంలో ఇప్పుడీ ట్రెండే నడుస్తోంది.
తాజాగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా తన ఫొటోలను, తన ఫ్యామిలీ ఫొటోలను ఘిబ్లీ స్టయిల్లోకి మార్చుకున్నారు. ఆ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఘిబ్లిఫైడ్ గ్యాంగులో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

