వల్లభనేని వంశీకి ఈరోజు వరుసగా రెండో షాక్

Vallabhaneni Vamsi Receives Second Shock Today
  • సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • ఐఓ, ప్రాసిక్యూషన్ జేడీలకు నోటీసులు జారీ చేసిన కోర్టు
  • కోర్టును ధిక్కరించేలా వ్యవహరించారన్న కోర్టు
వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈరోజు వరుసగా రెండో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. 

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కోర్టును ధిక్కరించేలా వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది. 

మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. 
Go Back to Shorts
Vallabhaneni Vamsi
Vamsi Bail Petition Rejected
SC ST Court Vijayawada
Gannavaram TDP Office Attack
Kidnapping Case
CID Court Remand
Andhra Pradesh Politics
YSRCP Leader
Satyavardhan Kidnapping

More Telugu News