ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి
- మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై నెటిజన్లు ఫైర్
- బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై సజ్జనార్ ట్విట్టర్ వార్
- మాజీ పోలీస్ బాస్ ట్వీట్లతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల అరెస్టు
హైదరాబాద్ మెట్రోలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రకటనలు తొలగించేలా చూడాలని కోరారు. ‘ఎందరినో బలి తీసుకొని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ బెట్టింగ్ మహమ్మారిపై, వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయెన్సర్లపై చేస్తున్న పోరాటానికి మీకు ధన్యవాదాలు సార్. ఒకవైపు మీరు ఈ మాఫియాపై యుద్ధం చేస్తుంటే, మరోవైపు మన హైదరాబాద్ మెట్రోలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రకటనలు ఇలా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలకు హైదరాబాద్ మెట్రో ఎలా అనుమతిచ్చింది? దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరు’ అంటూ తరుణ్ రెడ్డి అనే యూజర్ ట్విట్టర్ ద్వారా సజ్జనార్ కు విజ్ఞప్తి చేశారు.