ట్రంప్ మరో సంచలన నిర్ణయం
- యూఎస్ ఆర్మీలో ట్రాన్స్ జెండర్లపై బ్యాన్
- సైన్యంలోకి ఎంపిక చేయకుండా ఆదేశాలు
- ఇప్పటికే ఉన్నవాళ్లను కొనసాగిస్తామని వెల్లడి
లింగ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న దరఖాస్తులను అన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు పూర్తికాలం సేవలందించవచ్చని పేర్కొంది. కాగా, ప్రభుత్వ పథకాలు, ఇతర సందర్భాలలో పౌరుల నుంచి స్వీకరించే దరఖాస్తులలో జెండర్ కాలమ్ లో ఆడ, మగ మాత్రమే ఉంటుందని, థర్డ్ జెండర్ కు అవకాశం లేదని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. మహిళల క్రీడలలో ట్రాన్స్ జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు.