పులివెందులలో కీలక పరిణామం... టీడీపీలో చేరిన వైసీపీ నేత
- పులివెందులలో వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ అడుగులు
- బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేలా వ్యూహం
- ఈరోజు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ షాహిదా
తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. త్వరలోనే మరింత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.