ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ
- కేబీఆర్ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం స్వీకారం
- అల్లు అర్జున్ మామ ఇంటి స్థలానికి మార్కింగ్ వేసిన అధికారులు
- వివరణ ఇవ్వాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చంద్రశేఖర్ రెడ్డి
రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ లో ఓ వైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆయన కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్క్ చుట్టూ ఉన్న ఆరు కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 1,100 కోట్లను కేటాయించింది.