Team India: రెండో వన్డే: టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు బౌలింగ్

Team India asked to chase in 2nd ODI after England won the toss
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే జరుగుతోంది. కటక్ లోని బారాబతి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 28 పరుగులు. ఓపెనర్లు బెన్ డకెట్ 22, ఫిల్ సాల్ట్ 6 పరుగులతో ఆడుతున్నారు. 

మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతుండడం టీమిండియాకు సానుకూలాంశం. కోహ్లీ జట్టులోకి రావడంతో యశస్వి జైస్వాల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ద్వారా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరంగేట్రం చేస్తున్నాడు.

ఈ సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే. ఇవాళ్టి రెండో వన్డే కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.
Go Back to Shorts
Team India
England
2nd ODI
Cuttack

More Telugu News