అప్పటి వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దు: తెలంగాణ హైకోర్టు
- హరీశ్ రావును 12వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఉత్తర్వులు పొడిగింపు
- తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
- ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్ రావు పిటిషన్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలంటూ హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.