బనగానపల్లెలో టీడీపీ - వైసీపీ వర్గీయుల ఘర్షణ
- వైసీపీ నేత ఫయాజ్ కుమారుడి వివాహం సందర్భంగా ఘర్షణ
- వారి డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై ఎగిరిందంటూ టీడీపీ వర్గీయుల ఆగ్రహం
- డ్రోన్ ఆపరేటర్ పై టీడీపీ శ్రేణుల దాడి
ఘర్షణ వివరాల్లోకి వెళితే... బీసీ జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలోనే ఫయాజ్ నివాసం ఉంది. ఫయాజ్ కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ ఎగరడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసి, డ్రోన్ ఆపరేటర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.