తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్
- రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్
- ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మండిపాటు
- విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయిస్తున్నారని విమర్శ
ప్రొటోకాల్ తో సంబంధం లేకుండా రెండు కాన్వాయ్ లు, గన్ మన్లతో విచ్చలవిడిగా తిరుపతి రెడ్డి అధికారాన్ని చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే కావాలనుకుంటే మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అన్నారు. ఈ కుటుంబ పాలన, రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే విషయాలు తెలుసా? అని అడిగారు.