ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ
- నేరుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి..
- అక్కడి నుంచే పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన
- హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వేజోన్ పరిపాలన భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ఈమేరకు విశాఖ అధికారులకు పీఎంవో నుంచి సమాచారం అందిందని, అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం.