కేటీఆర్ పై కేసుతో బీజేపీకి, ప్రధానికి ఏం సంబంధం?: రఘునందన్ రావు
- కేంద్రాన్ని ఎదిరిస్తే కేసులు పెడుతున్నారన్న కవిత
- తప్పు చేసిన వారిపై కేసులు పెడతారన్న రఘునందన్ రావు
- తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ అని వ్యాఖ్యలు
కేసులతో భయపెట్టాలని తాము అనుకుంటే మొదట కేసీఆర్ నే ఎత్తుకెళ్లేవాళ్లమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చచ్చిన పాముల వంటివారని, ఉనికిని చాటుకోవడానికే కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి వారు ఎక్కడో ఓ చోట మాట్లాడుతుంటారని విమర్శించారు. కవిత ఓ మహిళ కాబట్టి సరిపోయిందని, లేకపోతే ఆమె చేసిన వ్యాఖ్యలకు తన సమాధానం మరోలా ఉండేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
మరీ అంత ఎగిరిపడొద్దు... జనాలు ఇప్పటికే ఓసారి బండకేసి కొట్టారు... ఇంకా ఎగిరిపడితే మళ్లీ బండకేసి కొడతారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ అని విమర్శించారు.