భారత మాజీ ప్రధాని మృతిపై పాకిస్థాన్ గ్రామస్థుల సంతాపం.. కారణం ఇదే..!
- సంతాప సభ ఏర్పాటు చేసి భారత మాజీ ప్రధానికి నివాళులు
- అంత్యక్రియలకు హాజరవ్వాలని ఉన్నా కుదరక గ్రామంలోనే సంతాపం
- ఇస్లామాబాద్ కు 100 కి.మీ. దూరంలోని గాహ్ గ్రామంలో మన్మోహన్ జననం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాహ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. దేశ విభజనకు ముందు భారత్ లో ఉన్న ఈ గ్రామం తర్వాత పాక్ లో కలిసింది. దేశం రెండు ముక్కలయ్యాక చాలా కుటుంబాలు పాక్ నుంచి ఇండియాకు వచ్చేశాయి. అలా వచ్చిన కుటుంబాలలో మన్మోహన్ సింగ్ కుటుంబం కూడా ఒకటి. భారత ప్రధానిగా పదేళ్ల పాటు దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్.. పాక్ లో పర్యటించినప్పటికీ తన స్వంత గ్రామానికి మాత్రం వెళ్లలేకపోయారు. ఒకసారి గాహ్ నుంచి ఢిల్లీకి వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడిని ఆప్యాయంగా ఆహ్వానించారు.