తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట
- ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ కు రిలీఫ్
- 10 రోజుల వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
- ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు ఆదేశాలు
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.