ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు: కేంద్రం స్పష్టీకరణ
- వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ
- భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదన్న బీసీసీఐ
- తాజాగా బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన భారత విదేశాంగ శాఖ
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసిందని, బీసీసీఐ చెప్పినట్టుగానే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని తెలిపారు. బీసీసీఐ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్థాన్ లో భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన చెందుతోందని, జైస్వాల్ చెప్పారు. అందుకే టీమిండియాను పాకిస్థాన్ పంపించడంలేదని అన్నారు.
కాగా, టీమిండియా పాకిస్థాన్ వెళ్లడంలేదన్న ప్రకటనల నేపథ్యంలో... హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ అంటే... కొన్ని మ్యాచ్ లు పాకిస్థాన్ లో, మరికొన్ని మ్యాచ్ లు ఇతర దేశాల్లోని వేదికలపై నిర్వహిస్తారు.
అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం హైబ్రిడ్ మోడల్ కు తాము అంగీకరించేది లేదని తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో, ఇవాళ జరగాల్సిన ఐసీసీ కీలక సమావేశం రేపటికి వాయిదా పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.