పాకిస్థాన్‌లో సర్‌ప్రైజ్... కోటి రూపాయలు ఖర్చు చేసి 20 వేలమందికి బిచ్చగాడి డిన్నర్!
- నానమ్మ జ్ఞాపకార్థం భారీ విందు ఏర్పాటు చేసిన బిచ్చగాడి కుటుంబం
- 1.25 కోట్ల రూపాయలతో 20 వేల మందికి భోజనం పెట్టిన కుటుంబం
- వేదిక వద్దకు అతిథులను తరలించేందుకు 2 వేల వాహనాలు ఏర్పాటు
పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ ప్రాంతంలో ఇటీవల బిచ్చగాడి నానమ్మ చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమకు తెలిసిన వారందరినీ ఆహ్వానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చారు.
మరో ఆసక్తికర అంశం ఏమంటే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు 2 వేల వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ విందులో వారి సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాలతో పాటు మాంసాహారం ఉండేలా చూసుకున్నారు. మటన్, స్వీట్ రైస్ కూడా పెట్టారు. ఈ విందు కోసం 250 మేకలను వధించినట్లుగా కథనాలు వచ్చాయి.