బీజేపీ సభలో జేబుదొంగల చేతివాటం... పర్సు పోగొట్టుకున్న మిథున్ చక్రవర్తి
- ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మిథున్ చక్రవర్తి
- నిర్సా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం
- సభలో మిథున్ పర్సు కొట్టేసిన జేబుదొంగలు
- తీవ్ర నిరాశతో సభ నుంచి వెళ్లిపోయిన మిథున్
తన పర్సు పోయిందన్న విషయాన్ని మిథున్ చక్రవర్తి సభ నిర్వాహకులకు తెలియజేశారు. దాంతో, నిర్వాహకులు పలుమార్లు మైక్ లో ప్రకటించారు. "మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇవ్వండి" అంటూ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర నిరాశకు గురైన మిథున్ చక్రవర్తి నిర్ణీత సమయం కంటే ముందు సభ నుంచి వెళ్లిపోయారు.