ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ ఖాళీలు.. కావాల్సిన అర్హతల వివరాలు!
- ఏపీ, తెలంగాణలలో 240 పోస్టుల భర్తీ
- మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- ఈ నెల 29 తో ముగియనున్న దరఖాస్తు గడువు
ఖాళీలు, అర్హతల వివరాలు..
మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఒక్కోదాంట్లో 20 చొప్పున మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. సంబంధింత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఖాళీలు కూడా 120 ఉన్నాయని, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. ఈ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ తెలిపింది. మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.