కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్... వీడియో ఇదిగో!

KTR hugs union minister Ram Mohan Naidu
  • హైదరాబాదులో ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ సదస్సు
  • హాజరైన రామ్మోహన్ నాయుడు, కేటీఆర్
  • రామ్మోహన్, కేటీఆర్ మధ్య అపురూప క్షణాలు
హైదరాబాదులో ఇవాళ ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో 'ది సదరన్ రైజింగ్' సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సెమినార్ లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. 

టీడీపీ యువ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేటీఆర్ ల మధ్య ఆత్మీయ క్షణాలు చోటుచేసుకున్నాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 

రామ్మోహన్ నాయుడ్ని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్... వీపు తట్టి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Kinjarapu Ram Mohan Naidu
KTR
ABP News Network
Hyderabad

More Telugu News