భారత్‌లో ఊహించిన దాని కంటే ముందే అందుబాటులోకి రాబోతున్న 6జీ టెక్నాలజీ
- 6జీ టెక్నాలజీని తీసుకొచ్చిన తొలి దేశంగా భారత్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా
- ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 6జీ ప్రణాళికల వెల్లడి
- 6జీ వినియోగంలోనూ భారత్ అగ్రగామిగా ఉంటుందని విశ్వాసం
4జీ, 5జీ టెక్నాలజీల వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ఇక 6జీ వినియోగంలో కూడా ముందుంటామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 6జీకి ఆమోదం తెలిపిన తొలి దేశం మనదే కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. 6జీ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలో ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా నొక్కి చెప్పారు. 6జీ ప్రయోజనాలు సాధారణ వినియోగదారుడికి కూడా చేరాలని, అందుకు ధరలు అందుబాటులో ఉండాలని అవసరం ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా 6జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి వస్తే.. 6జీ సాంకేతికతను వినియోగించనున్న తొలి వ్యక్తులుగా దేశంలోని రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వీ (వాడా-ఐడియా) యూజర్లు నిలవబోతున్నారు.