మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం..!: జగన్ కు టీడీపీ కౌంటర్
- ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందని జగన్ ప్రశ్న
- మీ ఇసుక దోపిడీపై ఎఫ్ఐఆర్ నమోదయిందన్న టీడీపీ
- మద్యం అమ్మకాలపై కూడా విచారణ ప్రారంభమవుతుందని వెల్లడి
నీ ఇసుక దోపిడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయిందని, విచారణ కూడా జరుగుతుందని టీడీపీ తెలిపింది. ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు వస్తుందని చెప్పింది. పాలన, పాలసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది.