ఆ మరణాలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే: కేటీఆర్
- సంగారెడ్డి జిల్లాలో కలుషిత నీటి కారణంగా మరణాలు!
- మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్న కేటీఆర్
- మిషన్ భగీరథ ప్రాజెక్టును సర్కారు సరిగా నిర్వహించలేకపోతోందని విమర్శలు
మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి తగిన సాయం అందించాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని కేటీఆర్ వెల్లడించారు. కానీ... కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి రాష్ట్రమంతా తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును రేవంత్ సర్కారు సరిగా నిర్వహించలేకపోతోందని విమర్శించారు.