రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ విమర్శలు
- మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారన్న మంద కృష్ణ
- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని మండిపాటు
- రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని... నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటిస్తూ... మాలల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చి, మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చారని అన్నారు. రేవంత్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గాయని చెప్పారు.