జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసుల పిటిషన్
- రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
- జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు
- ఇటీవల గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
తాజాగా, నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత... కోర్టులో హాజరుపరచడానికి ముందు కూడా పోలీసులు అతనిని విచారించారు. అయితే మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.