చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు
- 70 ఏళ్లలో షాంఘైని తాకిన తొలి తుపాన్
- గంటకు 151 కి.మీ. వేగంతో సిటీని తాకిందని అధికారుల వెల్లడి
- పార్కులు, పర్యాటక ప్రాంతాల మూసివేత
షాంఘై నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అత్యంత అరుదని అధికారులు తెలిపారు. చివరిసారి 1949లో టైపూన్ గ్లోరియా తర్వాత మళ్లీ ఇప్పుడు బెబింకా టైపూన్ ఈ సిటీని అల్లకల్లోలం చేస్తోందని వివరించారు. టైపూన్ కారణంగా ఆదివారం రాత్రి నుంచి విమానాశ్రయాలను మూసేశామని, వందలాది విమానాలను రద్దు చేశామని చెప్పారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను ఇబ్బందిపెట్టింది. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.