పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో పర్యటించనున్న జగన్
- ఉదయం 10.30 గంటలకు పిఠాపురం చేరుకోనున్న జగన్
- మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జగన్ పర్యటన
- ఏలేరు వరద బాధితులతో మాట్లాడనున్న జగన్
అనంతరం అక్కడి నుంచి యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు. ఆ తర్వాత రమణక్కపేటకు వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.
గత ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఇటీవల జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అలసత్వం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని ఆయన విమర్శించారు.