పవన్ కల్యాణ్ ఫొటోకి పూజ చేసి వరినాట్లు వేసిన రైతు

pawan kalyan photo poooja at ap video goes viral
  • తమిళనాడు సంస్కృతిి ఏపీలోకి
  • సినీ సెలబ్రిటీలను ఆరాధిస్తున్న అభిమానులు
  • జనసేన భారీ విజయంతో పవన్ పై ఫ్యాన్స్‌లో పెరిగిన అభిమానం
సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, ప్రజలకు ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే .. ఓ రైతు తన పొలంలో వరి నాట్లు వేసే ముందు భగవంతుడికి కాకుండా పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూజలు చేయడం. అందుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  
 
ఈ పరిణామంతో పవన్ కల్యాణ్‌కు కేవలం అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారన్న చర్చ సాగుతోంది. తమిళనాడులో నటీనటులకు అభిమానులు గుడి కట్ట పూజలు చేయడం ఉంది. ఇప్పుడు ఆ సంస్కృతి ఏపీకి పాకింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కల్యాణ్ .. ఆ తర్వాత తన వ్యక్తిగతమైన ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ స్టార్ ట్యాగ్ తో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్‌కు ఎక్కువే.
Go Back to Shorts
Pawan Kalyan
Social Media
Janasena
Andhra Pradesh

More Telugu News